Headlines

Sanghavi: అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. సంఘవి ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా.?

90వ దశకం తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. అప్పట్లో హీరోలతో పాటు హీరోయిన్లకూ మంచి ప్రాధాన్యం ఉండేది. సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, సంఘవి వంటి కథానాయికలు తమ అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అప్పటి యువతలో సంఘవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన సంఘవి అసలు పేరు కావ్య రమేష్. 1993లో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె.. దక్షిణాది భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ…

Read More

SBI కస్టమర్లకు శుభవార్త.. ఇప్పుడు యోనో యాప్ ద్వారా క్రెడిట్ కార్డులు.. కేవలం 10 నిమిషాల్లోనే..

SBI Credit Cards: పండుగ సీజన్‌కు ముందు ఎస్‌బిఐ కార్డ్ బుధవారం నాడు ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో కూడిన ఒక కొత్త సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు భౌతిక పత్రాలు సమర్పించకుండానే ఎస్‌బిఐ యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. పత్రికా ప్రకటన ప్రకారం, అడ్వాంటేజ్ ఎస్‌బిఐ కార్డ్‌ను పూర్తిగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారా పొందవచ్చు. దీనికి సుమారు 10 నిమిషాల సమయం పడుతుంది. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అనేది ఫిక్స్‌డ్…

Read More

ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్‌ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది

తెలుగు సినీ పరిశ్రమలో విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్య ప్రకాష్. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. తన సినీ ప్రయాణంలో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ ఆయన నిజజీవితంలో ఎంతో విభిన్నంగా ఉంటారు. సత్యప్రకాష్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసిన అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి తన పట్ల చూపించిన ఆప్యాయత, ప్రోత్సాహం…

Read More

ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్ విషయాలు!

టీనేజ్ బాలికల్లో క్రమరహిత పీరియడ్స్ సమస్య ప్రమాదకరంగా పెరుగుతోందని ఎయిమ్స్ (AIIMS) సర్వే వెల్లడించింది. 2023 నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 4,000 మంది విద్యార్థినులపై చేపట్టిన ఈ సర్వేలో.. ప్రతి ఐదుగురు అమ్మాయిలలో ఒకరు క్రమరహిత పీరియడ్స్ ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. పీరియడ్స్‌ సరిగ్గా రాకపోతే చాలామంది వెంటనే పీసీఓఎస్ (PCOS – Polycystic Ovary Syndrome) అని భయాందోళనకు గురవుతుంటారు. దీనిపై ఎయిమ్స్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ విభాగానికి చెందిన డాక్టర్ రజినీ శర్మ…

Read More

మాదాపూర్‌‌లోని ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం.. పోలీసుల తనిఖీల బట్టబయలు..!

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఐటీ కారిడార్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న రమ్మీ బెట్టింగ్ రాకెట్‌ను కూకట్‌పల్లి జోన్ ప్రత్యేక ఆపరేషన్ టీమ్ ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి విజయవంతంగా బట్టబయలు చేశారు. పోలీసులకు అందిన విశ్వసనీయ ముందస్తు సమాచారం ఆధారంగా కాకతీయ హిల్స్, రోడ్ నంబర్ 7 లో ఉన్న కైజెన్ వెంకటేశ్వర నిలయం అపార్ట్‌మెంట్‌పై ఒక్కసారిగా దాడి జరిపారు. సదరు అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 301 ను కేంద్రంగా చేసుకుని గత కొంతకాలంగా రహస్యంగా జూద క్రీడలు…

Read More

IND vs WI: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రో-కో జోడీ.. విండీస్ సిరీస్‌పైనే అందరి చూపు

IND vs WI: భారత క్రికెట్ జట్టు శుభమన్ గిల్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 27 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్ భారత జట్టుకు మాత్రమే కాకుండా, స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఎంతో ప్రత్యేకమైనదిగా నిలవనుంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు అరుదైన మైలురాళ్లను అధిగమించేందుకు కేవలం అతి కొద్ది…

Read More

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ బిల్లుల్లో తగ్గుతున్న ఛార్జీలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు అందించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ‘ట్రూడౌన్’ ప్రక్రియ ద్వారా విద్యుత్ ఛార్జీల్లో రాయితీ పొందే అవకాశం లభించింది. రాష్ట్రంలో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కంలు) నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ కారణంగా ఈ లబ్ధి చేకూరింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.629 కోట్లను ట్రూడౌన్ చేసేందుకు అనుమతి…

Read More

The Paradise: దసరా, హిట్ 3 రికార్డులు బద్దలు.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కొట్టిన ప్యారడైజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ అందుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. తొలిరోజు వసూళ్లలోనూ తన సత్తా చాటింది. తాజా  సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ ఇండియాలో తొలిరోజు ఇప్పటివరకు రూ.34.65 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని తెలుస్తుంది. ఈ…

Read More

Life Lesson: మీ జీవితాన్ని మార్చే గొప్ప పాఠం.. నాలుగు గుర్రాల కథ!

ఒక రాజ్యంలో ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర నాలుగు అందమైన గుర్రాలు ఉండేవి. అయితే అవి చాలా మొండివి, శిక్షణ లేనివి. రాజుకు ఆ గుర్రాలంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా వాటికి మంచి శిక్షణ ఇప్పించాలని ఆయన కోరుకునేవాడు. చాలామంది శిక్షకులు ఆ గుర్రాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరైనా వాటిపై ఎక్కి కూర్చుంటే వెంటనే కింద పడేసేవి. పైగా రాజుకు ఆ గుర్రాలంటే ఎంతో ఇష్టం ఉండటంతో వాటిని కొట్టడానికి, దండించడానికి…

Read More

మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ

రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ మానవులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తాజాగా తీర్థయాత్రలో కుటుంబం నుంచి తప్పిపోయిన ఓ వృద్ధుడిని సాంకేతికత ఆధారంగా ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిపాడు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. పంజాబ్‌కు చెందిన చమన్ లాల్ అనే వృద్ధుడు ప్రభుత్వ తీర్థయాత్ర పథకంలో భాగంగా అమృత్‌సర్ వెళ్లాడు. మతిమరుపుతో తీర్థయాత్రలో తప్పిపోయి 1,200 కిలోమీటర్లు దాటి వెళ్లిపోయాడు. మతిమరుపు కారణంగా బృందం నుండి విడిపోయిన ఆయన, పొరపాటున బీహార్ వెళ్లే రైలు ఎక్కి…

Read More